కారు టాక్స్ కేసులో ధనుష్ కి కోర్టు చీవాట్లు..

  0
  87

  కోట్లు సంపాదిస్తున్నారు.. కోట్లు పెట్టి విదేశీ కార్లు కొంటున్నారు.. పన్నులు కట్టేందుకు మీకెందుకు బాధ ..? అంటూ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సుబ్రమణియన్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ ను తీవ్రంగా మందలించారు. 48 గంటల్లోగా కారుకు చెల్లించాల్సిన 30 లక్షలరూపాయల టాక్స్ కట్టి , రసీదు కోర్టుకు చూపించాలని ఆదేశించారు. 2015 లో ధనుష్ రోల్స్ రాయిస్ కారు కొన్నాడు. దిగుమతిచేసుకున్న ఈ కారుకు టాక్స్ కట్టకుండా కోర్టులో పిటీషన్ వేసాడు. బైక్ , స్కూటర్ లు ఉన్నవాళ్లు , అర లీటరు , లీటరు పెట్రోల్ పట్టించుకుంటారు.. వాళ్లెప్పుడూ టాక్స్ కట్టలేమని కోర్టుకు రాలేదు.. రైతులు కష్టపడి పంటలు పండిస్తారు. వాళ్లెప్పుడూ టాక్స్ కట్టలేమని కోర్టుకు రారు.. కోట్లు సంపాదించే మీకేమైంది ..? అంటూ మందలించారు. ఇటీవల మరో తమిళ హీరో విజయ్ కూడా ఇదేరకమైన కారుకు టాక్స్ కట్టనంటూ కోర్టుకెక్కి చీవాట్లు తిన్నాడు.. ఇప్పుడు అది ధనుష్ వంతయింది..

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.