కానిస్టేబుల్ ఓవరాక్షన్.. ఉద్యోగం ఊడింది..

  0
  610

  ఈమధ్య పోలీసులకు కళాపోషణ బాగా ఎక్కువైంది. టిక్ టాక్ వీడియోలతో ఆమధ్య చాలామంది శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నారు. టిక్ టాక్ బ్యాన్ అయినా కూడా వీరి ఆవేశం చల్లారలేదు. అలాంటి యాప్స్ తో తమ నటనా చాతుర్యాన్ని చాటుకుంటున్నారు. పోనీలే అదో ఆర్ట్ అనుకోలేం. డ్యూటీ టైమ్ లో యూనిఫామ్ తో, డ్యూటీలో భాగంగా ఇచ్చిన రివాల్వర్ తో ఇలా పిచ్చి వేషాలు వేస్తే నిజంగానే ఉద్యోగం ఊడిపోతుంది.

  మహారాష్ట్రలో మహేష్ మురళీశంకర్ కాలే అనే ఓ పోలీస్ కానిస్టేబుల్ సరదాగా ఓ వీడియో తీసుకున్నాడు. హిందీ సింగమ్ సినిమాలో అజయ్ దేవగణ్ డైలాగులకు ఆయన పేరడీగా పెదాలు కదిపాడు. అక్కడితో ఆగకండా.. ఆ వార్నింగ్ సీన్ లో జీవించేశాడు కూడా. ఆయన స్టైల్, నడక, అంతా అదిరిపోయింది. కానీ సర్వీస్ రివాల్వర్ తో ఆయన చేసిన ఓవర్ యాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడే ఉన్నతాధికారులకు మండింది. వెంటనే కాలేకి ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చేశారు.

   

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.