ఆ బస్సులో ఉన్నవారు భయంతో వణికిపోయారు..

    0
    120

    భారీ వర్షం, కట్టలు తెగిన చెరువు ఊరిపై పడింది. రోడ్డుమీదుగా నీరు ప్రవహిస్తోంది. ప్రతి నిముషానికి వరదనీరు ఎక్కువవుతోంది. ఇది గ్రహించిన ఓ బస్ డ్రైవర్ రోడ్డుపై నీరుండగానే ముందుకు కదిలాడు. 40 ప్ర‌యాణికుల‌తో ఉన్న బ‌స్సును వ‌ర‌ద దాటించే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ, వ‌ర‌ద ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉండ‌టంతో బ‌స్సు వెనుక భాగం ఒక ప‌క్క‌కు జారిపోతుండ‌టాన్ని గ్ర‌హించి ఆపేశాడు. బ‌స్సు వ‌ర‌ద‌లో చిక్కి విష‌యాన్ని గ్ర‌హించి స్థానికులు పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో.. వారు వెంట‌నే స‌హాయ‌క సిబ్బందితో ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. బ‌స్సులో ఉన్న 40 మంది ప్ర‌యాణికులను సుర‌క్షితంగా బ‌య‌టికి తీసుకురావ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    రాజ‌స్థాన్‌లోని కోటా జిల్లాల్లో ఈ ఘటన జరిగింది. కుంభ‌వృష్టి కార‌ణంగా న‌దులు, వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కోటా జిల్లాలోని ఇటావా ఏరియాలో ఓ చెరువు పొంగిపొర్లుతూ ర‌హ‌దారిపై నుంచి వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తోంది. ఇందులో బస్సు చిక్కుకుంది.

    ఇవీ చదవండి..

    కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

    ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

    అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

    తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.