ఆదివారం చికెన్ షాపులు బంద్..

  0
  71

  కరోనా కర్ఫ్యూని కట్టుదిట్టంగా అమలు చేయడంలో భాగంగా ఆదివారం చికెన్, మటన్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ప్రకటించారు. ఈ నెల 30న (ఆదివారం) మాంసం, సీఫుడ్‌ విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్‌ సృజన వెల్లడించారు. మాంసం దుకాణాల వద్ద జనం గుమిగూడటంతో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రజలంతా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నగరంలో గత ఆదివారం కూడా మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. ఈ ఆదివారం కూడా ఆ నిషేధాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి ఏపీలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఈ నిషేధం అమలులో ఉంటుంది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..