కరోనా తర్వాత అన్ని ఫంగస్ లు చుట్టుముట్టాయి..

  0
  43

  కరోనా వచ్చినవారిలో కొంతమందికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తాయి. మరికొంతమందిలో వైట్ ఫంగస్ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకొందరిలో యెల్లో ఫంగస్ కూడా బయటపడిందని వార్తలొచ్చాయి. అయితే ఈ మూడు ఫంగస్ లు ఒకరిలోనే కనిపించడం విజంగా వింత, విశేషం. అలా మూడు ఫంగస్ లు అటాక్ అవడంతో మరణించిన కొవిడ్ పేషెంట్ కున్వర్ సింగ్. ఘజియాబాద్ లోని అడ్వొకేట్ కున్వర్ సింగ్ కొవిడ్ కారణంగా ఆస్పత్రిలో చేరాడు. కరోనా తగ్గేసమయంలో అతనికి బ్లాక్ ఫంగస్ అటాక్ అయింది. ఆ తర్వాత వైట్ ఫంగస్, వెంటనే యెల్లో ఫంగస్.. ఇలా మొత్తం మూడు ఫంగస్ లు కున్వర్ సింగ్ ని చుట్టుముట్టాయి. ఎండోస్కోపీలో ఈ ఫంగస్ ల జాడ బయటపడింది. అప్పటికీ వైద్యులు తమ ప్రయత్నం చేశారు. అయినా కూడా మూడు ఫంగస్ ల కారణంగా కున్వర్ సింగ్ మృతి చెందాడు. ఈ మూడు ఫంగస్ లు బ్రెయిన్ కి దగ్గరగా ఉన్నట్టు గుర్తించారు వైద్యులు. చికిత్సలో భాగంగా కున్వర్ సింగ్ సగం దవడ తొలగించారు. కానీ రక్తమంతా విషపూరితం అయింది. చివరకు కరోనా నుంచి కోలుకున్నా ఫంగస్ ల దాడితో కున్వర్ సింగ్ మరణించాడు..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..