చికెన్ పీస్ ఖరీదు రూ.73లక్షలు..

  0
  281

  చికెన్ పీస్ ఖరీదు 50నుంచి 100 రూపాయల మధ్యలో ఉంటుంది. ఎంత కాస్ట్ లీ రెస్టారెంట్ లో తిన్నా.. మరీ వేలల్లోకి వెళ్లదు. అయితే ఇక్కడ వేలు దాటి లక్షల్లోకి వెళ్లింది ఓ చికెన్ పీస్ ఖరీదు. అవును, ఆన్ లైన్ వేలంలో ఆ చికెన్ పీస్ రేటు ఏకంగా రూ.73లక్షలు పలికింది.
  ఎందుకంటే..?
  ఫాస్ట్ ఫుడ్ ఔత్సాహికులకు మెక్‌‌డొనాల్డ్ చికెన్ నగ్గెట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది వీటిని తెగ ఇష్టపడతారు. ఈ నగ్గెట్స్ వీడియో గేమ్‌ లోని ఓ పాత్ర ఆకారంలో తయారు చేస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? కానీ ఆన్‌లైన్ గేమ్ ‘అమాంగ్ అస్’ అనే వీడియో గేమ్‌లోని క్యారెక్టర్ ఆకారంలో తయారు చేసిన మెక్‌డొనాల్డ్స్ చికెన్ నగ్గెట్ ఒకటి 99,997 డాలర్లకు అమ్ముడైంది. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ. 73 లక్షలు.
  కొన్నదెవరు..?
  ఈ చికెన్ నగ్గెట్‌ను eBayలో ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ పెట్టగానే జనాలు ఎగబడ్డారు. ‘అమాంగ్ అస్’ వీడియో గేమ్‌ ను ఇష్టపడేవారు.. ఆ చికెన్ నగ్గెట్‌సొంతం చేసుకోవాలని నిర్ణయించారు. ఉటాకు చెందిన పోలిజ్నా అనే వ్యక్తి రూ.73 లక్షలకు ఈ చికెన్ పీస్ ని కొనుగోలు చేశాడు.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..