భర్తను చంపి, ముక్కలు చేసి , యాసిడ్ లో పోసి..

  0
  1168

  భార్య అక్రమ సంబంధం ఒక భర్త ప్రాణం తీసింది.. రాధ అనే 30 ఏళ్ళ యువతి , భర్త రాకేష్ ని హత్యచేసింది. రాకేష్ , సుభాష్ అనే ఇద్దరు స్నేహితులు, వ్యాపార భాగస్వాములు.. రాకేష్ ఎక్కువగా వ్యాపారంపని మీద బయటతిరిగేవాడు.. దీన్ని అవకాశంగా తీసుకొని రాధ , సుభాష్ మధ్య అక్రమసంబంధం ఏర్పడింది.. దీంతో తమకు అడ్డుగా ఉన్న రాకేష్ ని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. రాకేష్ మద్యం మత్తులో ఇంట్లో నిద్రపోతున్న సమయంలో రాధ , తన చెల్లెలు , ఆమె భర్త సాయంతో అతడి గొంతు నులిమి చంపేసింది.

  తర్వాత ప్రియుడు సుభాష్ ని పిలిపించింది. మృతదేహాన్ని బయటకు తరలించకుండా ఇంట్లోనే , యాసిడ్ లో పోసి కరిగించాలని ప్లాన్ చేశారు. యాసిడ్ తెప్పించి దాన్ని మిక్సింగ్ చేసేప్పుడు పేలుడు జరిగింది. దీంతో పక్కింటి వాళ్ళ ఫిర్యాదు మేరకు పోలీసులు రావడంతో , ఇంట్లో ముక్కలు , ముక్కలుగా చేసిన శవం కనిపించడంతో అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. అందరినీ అరెస్ట్ చేశారు.. బీహార్ లోని ముజఫరాపూర్ , సికందర్ పూర్ లో జరిగిందీ ఘోరం..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.