సల్మాన్ ఖాన్ పై చీటింగ్ కేసు..

  0
  262

  బీయింగ్ హ్యూమన్ సంస్థ పేరుతో సల్మాన్ ఖాన్ చేస్తున్న వ్యవహారాలపై ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో సల్మాన్ పై చండీగఢ్‌లో చీటింగ్‌ కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. సల్మాన్ తోపాటు, ఆయన సోదరి అల్విరా ఖాన్‌ అగ్నిహోత్రి, బీయింగ్‌ హ్యూమన్‌ ఫౌండేషన్‌కు చెందిన ఏడుగురిపై అరుణ్‌ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. జులై 13లోపు వివరణ ఇవ్వాలని సమన్లు కూడా జారీ చేశారు.
  బీయింగ్ హ్యూమన్ అనే బ్రాండ్ కి సల్మాన్ ప్రమోటర్ గా ఉన్నారు. ఆ బ్రాండ్ పేరుతో వచ్చే సంపాదనని స్వచ్ఛంద సంస్థకి ఇస్తుంటారు. ఈ క్రమంలో బీయింగ్ హ్యూమన్ పేరుతో ఫ్రాంచైజీ తెరవాలంటూ కొందరు తనను సంప్రదించారని, వారు తనను మోసం చేశారని, తన షాపు ఓపెనింగ్ వస్తానని చెప్పి సల్మాన్ ఖాన్ కూడా మోసం చేశారంటూ అరుణ్ గుప్తా ఫిర్యాదు చేశారు. తనతో 2కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారని కూడా అన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు సల్మాన్‌, ఆయన సోదరి అల్విరా, సంస్థ సీఈఓ ప్రకాశ్ కాపరే సహా మరో ఏడుగురిపై కేసు నమోదైంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.