నగరంపై కోరలు చాచిన అగ్నిపర్వతం.. భీకర దృశ్యం.

  0
  110

  అగ్నిపర్వతం బద్దలైంది.. ఐలాండ్స్ ని లావా ముంచెత్తింది..
  నిద్రాణంలో ఉన్న అగ్నిపర్వతం అది. దాని పేరు లా పామా. స్పెయిన్ లోని ఈ నిద్రాణ అగ్నిపర్వతం వందేళ్ల క్రితం ఓసారి బద్దలైంది. ఆ తర్వాత ఇప్పటి వరకూ దానిలో ఎలాంటి ప్రమాద జాడా లేదు. దీంతో ఆ అగ్నిపర్వతం చుట్టూ కేనరీ ఐలాండ్స్ వెలిశాయి. అదో పర్యాటక కేంద్రంగా తయారైంది. ఇళ్లు, స్విమ్మింగ్ పూల్స్, కాటేజీలతో కేనరీ ఐలాండ్స్ చూడముచ్చటగా ఉంటాయి. స్పెయిన్ లోనే అదో అద్భుతమైన పర్యాటక కేంద్రం. అయితే ఉన్నట్టుండి లాపామా బద్దలైంది. ఎవరూ ఊహించని విధంగా లావాను విరజిమ్మింది. కళ్లముందే నిముషాల వ్యవధిలో ఊరు శ్మశానంలా మారింది. ఇళ్లన్నీ తగలబడిపోయాయి. చెట్టూ చేమా మాడి మసైపోయాయి. కేనరీ ఐలాండ్స్ ని లావా ముంచెత్తుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అగ్నిపర్వతం బద్దలు కావడం, ఐలాండ్స్ ని లావా ముంచెత్తడం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.