పెళ్లిలో తాళిబొట్టు తీసి హోమంలో వేసింది.

  0
  1784

  పెళ్ళిలో అమ్మాయిల చివరి క్షణం డుమ్మాలు ఇప్పుడు సెన్సేషన్.. ఒకమ్మాయి ఆరు అడుగులేసి , ఏడో అడుగులో పెళ్లివద్దంది.. మరొక అమ్మాయి అబ్బాయికి ఎక్కాలు రావని , మరో అమ్మాయి అబ్బాయికి కళ్ళజోడు ఉందని , ఇలా రకరకాల కారణాలతో చివరి క్షణంలో పెళ్లిళ్లు ఎగ్గొట్టేస్తున్నారు. తమిళనాడులో మరో ఇద్దరమ్మాయిలు , పెళ్ళికొడుకు తాళి చేతుల్లోకి తీసున్నవెంటనే , ఆగు , నా ప్రియుడు వస్తాడు అని చెప్పి లేచేసింది..

  ఇప్పుడు తాజాగా రాంచీలోని మౌసిబరిలో వినోద్ అనే అబ్బాయికి , చంద్రకు పెళ్లి జరుగుతొంది. పెళ్లిలో తాళికట్టే పనికూడా అయిపోయి , పెళ్ళికొడుకు , పెళ్లికూతురు నుదుట కుంకుమ దిద్దే సమయంలో , పెళ్లికూతురు తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని లేచేసింది. తాళిబొట్టు తీసి హోమంలో వేసింది. దీంతో అందరూ నోరెళ్లబెట్టారు. ఎవరెన్ని విధాలుగా చెప్పినా పెళ్లికూతురు వినలేదు. దీంతో పెళ్ళికొడుకు , అతడి బంధువులు పెళ్లికూతురు ఇంటిముందు ధర్నా చేశారు. పెళ్ళికి ఖర్చులు తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.