పెళ్లి దగ్గర పడింది. జుట్టంతా రాలిపోయింది.

  0
  35

  ఎన్నో కలలు కన్న పెళ్లి సమయం దగ్గర పడింది. అయితే ఆ అమ్మాయి దురదృష్టం పెళ్లి దగ్గర పడే సమయానికి ఉన్న జుట్టంతా ఊడిపోయింది. సోఫీ హిచెన్ అనే 24 ఏళ్ల యువతికి ఏప్రిల్ నెలనుంచి జుట్టు ఊడటం ప్రారంభించి.. మే నెలాఖరు నాటికి జుట్టులో 90 శాతానికి పైగా ఊడిపోయింది. అలపీశియా అనే వ్యాధి కారణంగా ఇలా జుట్టంతా అకస్మాత్తుగా రాలిపోయింది. వైద్య శాస్త్ర ప్రకారం ఈ వ్యాధి ఎందుకొస్తుందో.. దానికి వైద్యం ఏమిటో కూడా ఎవరికీ తెలీదు.. సేల్స్ టీం లీడర్ గా పనిచేసే సోఫీ.. ఇలా జుట్టు రాలిపోతుంటే దిగులు పడి మూలన కూర్చోలేదు..

  ఇలాంటి వ్యాధి బారిన పడినవారిలో ఆత్మస్థైర్యం నింపి.. వారిని సమాజంలో క్రియాశీలకం చేసేలా పనిచేస్తోంది. జుట్టురాలిపోతుందని మానసికంగా ఒత్తిడికి గురైతే ఒక్కదఫా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని.. అందువలన మహిళలు ఇలాంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పింది. ఇప్పుడు ఈ వ్యాధిపై ఆమె అవగాహన పెంచుతోంది. శరీరంలో వ్యాధినిరోధక వ్యవస్థ తనమీద తనే తిరుగుబాటు చేసినపుడు ఇటువంటి పరిస్థితి వస్తుంది. శరీరంలోని టీ లింఫోసైట్స్ అనే రక్తకణాలు వెంట్రుకల కుదుళ్లను బలహీనపరుస్తాయి. ఇక వెంట్రుకలు పెరగకుండా నిరోధిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉండే వారిలో 25 శాతం వారసత్వంగా ఈ వ్యాధి వచ్చేదని గుర్తించారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..