వెంకయ్య నాయుడు వర్సెస్ ట్విట్టర్..

  0
  29

  కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ మధ్య గత కొంతకాలంగా వార్​ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్​ అకౌంట్ కు బ్లూ టిక్ తొలగించడం మరింత సంచలనంగా మారింది. అయితే ఆ వెంటనే దాన్ని పునరుద్ధరించినా బీజేపీనేతలు మాత్రం విమర్శలు ఆపలేదు.

  సాధారణంగా ఏదైనా అకౌంట్​ వెరిఫైడ్​ అని చెప్పేందుకు బ్లూటిక్ పెడతారు. నెటిజన్లు కూడా ఈ బ్లూటిక్స్​ ఆధారంగానే వెరిఫైడ్​ అకౌంటా కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకుంటారు. చాలా కాలం పాటు ఖాతాను ఉపయోగించకపోవడం వల్ల బ్లూ టిక్స్​ ను తొలగించినట్టు ట్విట్టర్​ ప్రతినిధులు తెలిపారు. వెంకయ్య నాయుడు పర్సనల్ అకౌంట్ చివరిసారిగా జూలై 23, 2020న వాడారు. ఆతర్వాత ఉపయోగించలేదు. దీంతో నిబంధనల ప్రకారం బ్లూ టిక్స్​ తొలగించినట్టు ఆ సంస్థ అధికారులు తెలిపారు. అయితే ఆ వెంటనే మళ్లీ ఎందుకు పునరుద్ధరించారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్​ పక్షపాత ధోరణిని అవలంబిస్తోందని వారు ఆరోపించారు.

  ఎవరిదైనా నకిలీ అకౌంట్​ అని తేలితే కూడా అన్​వెరిఫైడ్​ చేస్తారు. అయితే ఏకంగా ఉప రాష్ట్రపతి విషయంలో ఇలా జరగడం గమనార్హం. డిజిటల్​ మీడియాలో డేటా నియంత్రణ కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల విషయంలో ట్విట్టర్​, కేంద్ర ప్రభుత్వం మధ్య కొద్ది రోజులుగా వార్​ సాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన రూల్స్​తో వినియోగదారుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ట్విట్టర్​ వాదిస్తున్నది. ఆ విష‌యం కేంద్రానికి కోపం తెప్పించింది.

  మరోవైపు ఇటీవల కాంగ్రెస్​ టూల్​ వ్యవహారంలో బీజేపీ నేతల ట్వీట్లకు ట్విట్టర్​ నకిలీ మీడియా అని మార్కు చేయడం కూడా వివాదాస్పదం అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రోల్స్​ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలపై చర్యలకు పూనుకుంది. ఈ క్రమంలో ఉప రాష్ట్రపతి అకౌంట్​కు బ్లూ టుక్స్​ తొలగించడం వివాదాస్పదమైంది. అయితే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఉన్న అకౌంట్ కి మాత్రం బ్లూ టిక్స్ అలాగే ఉన్నయి. ఇందులో వెంకయ్య నాయుడు ట్వీట్స్ రెగ్యులర్ గా అప్డేట్ అవుతున్నాయి.

   

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..