ఏపీలో రేపు బిగ్ వ్యాక్సినేషన్ డే..

  0
  161

  ఏపీలో రేపు ఒకేరోజు దాదాపుగా 10లక్షలమందికి కరోనా టీకాలు వేయాలని నిర్ణయించింది ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. బిగ్ వ్యాక్సినేషన్ డే గా దీన్ని పిలుస్తున్నారు. రేపు ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా క‌నీసం 8 ల‌క్ష‌ల నుంచి 10 లక్ష‌ల వ‌ర‌కు వ్యాక్సిన్లు వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు అధికారులు. ఒక్కో జిల్లాలో లక్ష మందికి వ్యాక్సిన్ వేయాలన్నది ప్రభుత్వ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. ఉదయం 7 గంటలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంద‌ని వెల్ల‌డించారు.
  45 ఏళ్ళు పైబడిన వారికి, 5 ఏళ్ళలోపు పిల్లలు ఉన్న తల్లులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 1,149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, ఇతర ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నట్టు చెప్పారు. వ్యాక్సిన్ సెంటర్ల ఏర్పాట్లు జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారుని తెలిపారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..