ఇక తిరుమలకి అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే..

  0
  206

  తిరుమలను గ్రీన్ జోన్ గా ప్రకటించామని భవిష్యత్తులో కొండపైకి అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే నడుపుతామని తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. పాలకమండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని, భవిష్యత్తులో కొండపైకి కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే నడుపుతామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ లోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు సుబ్బారెడ్డి. వారంలోగా తిరుమల కొండపై అనధికారిక దుకాణాల తొలగిస్తామన్నారు. ఏపీలోని 13 ప్రాంతాల్లో నూతనంగా టీటీడీ కల్యాణ మండపాల నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. ఏపీ, తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 500ఆలయాలను ఏడాదిలోగా నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా 100 ఆలయాలకు గోవులను అందించామని వెల్ల‌డించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులను ఆలయాల నిర్మాణానికి వెచ్చిస్తామని, దేశవ్యాప్తంగా ఇలా 500 ఆలయాల నిర్మాణం చేపడుతున్నట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..