అమెరికా బయలుదేరిన రజినీకాంత్..

  0
  189

  రజినీకాంత్ అమెరికా ఆరోగ్య పర్యటన ఈరోజు మొదలైంది. అమెరికాలో స్పెషల్ చెకప్ కోసం ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. అమెరికాలో సినిమా షూటింగ్ నిమిత్తం ఉన్న తన అల్లుడు ధనుష్ దగ్గరకు ఆయన వెళ్లారు. అక్కడే ఆయన కొన్నిరోజులపాటు విశ్రాంతి తీసుకుంటారని తెలుస్తోంది.
  రజినీ పర్యటనకు ప్రత్యేక అనుమతి..
  వాస్తవానికి అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఉన్నా కూడా రజినీకాంత్ కి భారత, అమెరికా ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతినిచ్చాయి. రజినీ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవడంతోపాటు, ఆయనతో బయలుదేరి వెళ్లినవారికి కూడా రెండు డోసులు పూర్తయ్యాయి. మొత్తం 14మంది పట్టే ప్రత్యేక విమానంలో రజినీ కుటుంబ సభ్యులతో కలసి అమెరికా బయలుదేరి వెళ్లారు.
  అన్నాత్తే షూటింగ్ లో అస్వస్థత..
  ఆమధ్య హైదరాబాద్ లో అన్నాత్తే సినిమా షూటింగ్ టైమ్ లో రజినీ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లు చెన్నైలో చికిత్స తీసుకున్న రజినీ ఇటీవల విశ్రాంతిలో ఉన్నారు. అమెరికాలో స్పెషలిస్ట్ వైద్యుల వద్ద మెడికల్ చెకప్ కోసం వెళ్తున్నారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..