బ్యాంకు ఉద్యోగాలకు ప్రాంతీయ భాషల్లో టెస్ట్. .

    0
    73

    బ్యాంకుల్లో క్లర్క్ స్థాయి ఉద్యోగాలకు ప్రాంతీయ భాషల్లో రాత పరీక్షలు పెట్టాలని కేంద్రం నిర్ణయించే అవకాశం ఉంది.. ఇందుకోసం అధ్యయనం చేసేందుకు ఒక కమిటీనికూడా నియమించారు. ఈ కమిటీ నివేదిక వచ్చేవరకు బ్యాంకు క్లరికల్ పరీక్షలను వాయిదావేసి అంశాన్ని పరిశీలిస్తున్నారు. 15 రోజుల్లోగా ప్రాంతీయభాషలో పరీక్షల నిర్వహణకు సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇస్తారు. ప్రస్తుతం బ్యాంక్ పరీక్షలు హిందీ , ఇంగ్లీష్ భాషల్లోనే నిర్వహిస్తున్నారు. రాజ్యాంగం షెడ్యూల్లో ఉన్న అన్ని భాషల్లో ఈ పరీక్షలు నిర్వహించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది.. పరీక్షలను స్థానిక భాషల్లో నిర్వహించకపోవడంవల్ల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు నష్టపోతున్నారన్న అభిప్రాయం ఉంది..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.