బ్యాంక్ లాకర్లో బంగారం మాయం.. గిల్ట్ నగలతో అటెండర్ మోసం..

    0
    127

    బ్యాంక్ లాకర్లో బంగారం పెట్టుకుని ధీమాగా ఉన్న కస్టమర్లను నిలువునా ముంచేశాడు ఆ అటెండర్. గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడా లో అటెండర్ గా పనిచేసే సుమంత్ అనే వ్యక్తి.. మెల్ల మెల్లగా లాకర్లలోనుంచి బంగారం మాయం చేయడం అలవాటు చేసుకున్నాడు. ఆ స్థానంలో గిల్ట్ నగలను పెట్టి.. అసలు వాటిని తీసుకెళ్లి బయట ముత్తూట్ ఫైనాన్స్ లో కుదవపెట్టేవాడు. అలా వచ్చిన డబ్బుతో అతను ఆన్ లైన్ రమ్మీ ఆడేవాడు. రమ్మీలో లాభం వస్తే.. బంగారం విడిపించి సైలెంట్ గా ఉందామనుకున్నాడు. కానీ వాడి ప్లాన్ బెడిసికొట్టింది. ఆన్ లైన్ రమ్మీతో నిండా మునిగిన సుమంత్ చివరకు చేతులెత్తేశాడు. మోసం బయటపడటంతో పోలీసులు అతడిని వలపన్ని పట్టుకున్నారు. మొత్తం 5 కేజీల 800 గ్రాముల బంగారాన్ని 48 సంచుల్లో తరలించాడని పోలీస్ విచారణలో తేలింది. వీటి విలువ 2కోట్ల 36 లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.