అంతరిక్షాన్ని తాకిన ఆనందంలో శిరీష..

    0
    4644

    అంతరిక్షంలోకి వెళ్లిన తొలి తెలుగమ్మాయిగా రికార్డు సృష్టించిన బండ్ల శిరీష.. అంతరిక్షంలో ఎలా ఉందో ఓసారి చూడండి. వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో చేరిన ఆమె ఈ అరుదైన ప్రయాణంలో భాగస్వామిగా మారారు. ఆ కంపెనీలో ఆమె ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌ గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ఆమె ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ-22’లో దూసుకెళ్లి.. తన అంతరిక్ష విహార కలను సాకారం చేసుకున్నారు.

    సాధారణంగా వ్యోమనౌకలు రాకెట్‌ సాయంతో నింగిలోకి దూసుకెళతాయి. వర్జిన్‌ గెలాక్టిక్‌ మాత్రం భిన్న విధానాన్ని అవలంబించింది. వీఎంఎస్‌ ఈవ్‌ అనే ప్రత్యేక విమానం ద్వారా వీఎస్‌ఎస్‌ యూనిటీ-22ను ప్రయోగించింది. రెండు బాడీలు, సువిశాల రెక్కలతో కూడిన ఈ విమాన మధ్య రెక్కల భాగానికి వ్యోమనౌకను అనుసంధానించారు.

    టేకాఫ్‌ అయిన 40 నిమిషాల తర్వాత, దాదాపు 15వేల మీటర్ల ఎత్తుకు చేరాక ఈవ్‌ నుంచి యూనిటీ-22 విడిపోయింది. ఈ దశలో యూనిటీ-22లోని రాకెట్‌ ఇంజిన్‌ మండింది. దీంతో వ్యోమనౌక వేగం గంటకు 4వేల కిలోమీటర్లకు పెరిగింది. అది మరింత ఎత్తుకు దూసుకెళ్లింది. భూమి నుంచి దాదాపు 88 కిలోమీటర్ల ఎత్తులోని ‘సబ్‌ ఆర్బిటల్‌’ ఎత్తుకు చేరుకుంది. (అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ప్రమాణాల ప్రకారం 80 కిలోమీటర్ల ఎత్తు దాటితే అంతరిక్షంలోకి వెళ్లినట్లే) ఆ సమయంలో 4-5 నిమిషాల పాటు వ్యోమగాములు భారరహితస్థితికి లోనయ్యారు. అనంతరం యూనిటీ-22 తిరుగు ప్రయాణమైంది. దట్టమైన భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ప్రయాణమార్గానికి అనుగుణంగా వ్యోమనౌక తన రెక్కల ఆకృతిని సర్దుబాటు చేసుకుంది. గ్లైడర్‌లా కిందకి వచ్చింది.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.