ఆ ఆటోడ్రైవర్ నిజంగా దేవుడే.. తన ప్రాణాలకు తెగించి , రైలుకింద పడబోతున్న ఆమ్మాయిని కాపాడాడు. అతడి ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు, ప్రశంసలతో ముంచెత్తారు.. అయితే రైల్వ్ గేటుదగ్గర అంతమంది ఉన్నా , ఆ యువతి ప్రాణం కాపాడగల ధైర్యం అతనొక్కడికే ఉంది.. అందుకే అతడు రియల్ హీరో.. ఇండోర్ లో ఓ యువతి అందరితోపాటు రైల్వే క్రాసింగ్ దగ్గర వెయిట్ చేస్తోంది.. గేట్ పడటంతో ఆటో డ్రైవర్ కూడా వెయిట్ చేస్తున్నాడు. రైలు వేగంగా వస్తుండటం చూసి , అప్పటివరకు అక్కడేఉన్న యువతి పరుగులుతీస్తూ పట్టాలపైకి వెళ్ళింది. చనిపోయేందుకు ఆమె ప్రయత్నమని అందరికీ అర్థమై కేకలు వేశారు.. అయితే ఆటో డ్రైవర్ మాత్రం , మెరుపు వేగంతో పట్టాలమీదకెళ్ళి అమ్మాయిని అతికష్టం మీద పక్కకు లాగేసాడు. తరువాత అమ్మాయిని సముదాయించాడు.. ఇలాంటి హీరోలు ఉండేది సినిమాల్లో కాదు.. నిజజీవితంలోనే..
ఇవీ చదవండి..