కోడలా ..నీకూ కరోనా అంటించా .ఓ అత్త కిరాతకం.

  0
  34

  కోడళ్లను వేధించే ఆ అత్తలు చూపే నరకంలో ఈ అత్తది ఒక కొత్త స్టైల్.. కరోనాతో బాధ పడుతున్న ఓ అత్త తనకోడలిపై కోపంతో ఆమెను కౌగిలించుకుని కోడలికి కరోనాను అంటించేసింది. తెలంగాణలోని సోంరి పేటలో ఈ సంఘటన జరిగింది. కరోనా వచ్చిన అత్తని ఓ గదిలో పెట్టి.. బయటకు రావద్దని చెప్పడంతో ఆ అత్త రెచ్చిపోయింది. ఇతర కుటుంబ సభ్యులెవరూ ఆమెను పరామర్శించక పోవడంతో ఆమె కుంగిపోయింది. దీంతో అత్త బయటకు వచ్చి.. గందరగోళం చేసింది. కోడళ్లను కౌగలించుకుని.. కిందపడేసి.. వారికి కరోనాను అంటించేసింది.

  నాలుగు రోజుల తర్వాత కోడలు టెస్ట్ చేయించగా.. ఆమెకు పాజిటివ్ గా తేలింది. తన అత్త.. తనకు కరోనా సోకేలా చేసిందని ఆరోగ్యశాఖ అధికారులకు చెప్పింది. తనకు కరోనా వచ్చిందని.. నీక్కూడా కరోనా రావాలంటూ అంటించేసిందని చెప్పింది. తాను చనిపోతే మీరంతా సంతోషంగా ఉంటారా అంటూ కేకలేస్తూ.. తనమీదకి వచ్చి.. నోట్లో నోరు పెట్టి గందరగోళం చేసిందని ఫిర్యాదు చేసింది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామం నుంచి ఆమె సోదరి వచ్చి.. ఆమెను తీసుకెళ్లింది. ప్రస్తుతం సోదరి ఇంట్లో ఉన్న ఆమె ఆరోగ్యంగానే ఉంది. అత్త మాత్రం ఒంటరిదై పోయింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..