ఏటీఎం దోచుకోడానికి ఆ టింగరి దొంగ వేసిన వేషాలు..

  0
  42

  ఏటీఎం దోపిడీల చిత్ర విచిత్రాల్లో ఇదో విచిత్రం. పాపం దొంగలు మిక్కీ మౌస్ వేషంలో ఏటీఎం దోపిడీకి వచ్చి కాసేపు చెమటోడ్జి ఏటీఎంని పగలగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమై వెనుదిరిగిపోయారు. తమిళనాడులోని కన్యాకుమారి కురుంపని ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ లో రాత్రి ఒంటిగంటకు గునపంతో ఇద్దరు దొంగలు ప్రవేశించారు. సీసీ కెమెరాల కంట పడకుండా బ్లాక్ జీన్స్, ఫుల్ షర్ట్, చేతులకు గ్లౌజ్ లు మిక్కీ మౌస్ మాస్క్ లు వేసుకుని లోపలికి వచ్చారు. ఏటీఎంను పగలగొట్టాలని చాలాసేపు ప్రయత్నం చేసి విఫలమై నిరాశగా వెళ్లిపోయారు. ఒక ఏటీఎంలో ట్రాన్సాక్షన్ బ్లాక్ అయిన తర్వాత సిబ్బంది వచ్చి చూశారు. అప్పుడు ఏటీఎం పగలగొట్టినట్టు కనిపించింది. దీంతో సీసీ కెమెరా ఫుటేజీ చూడగా దొంగతనానికి ఇద్దరు వ్యక్తులు వచ్చినట్టు తేలింది.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..