ఇసుక లారీలను చుట్టుముట్టిన వరదనీరు..

    0
    40

    కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో నదిలో ఇసుక కోసం వెళ్లిన వందకుపైగా లారీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అకస్మాత్తు వరద నీరు రావడంతో.. ఇసుక లారీలు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న రోడ్డు కొంతమేర దెబ్బతింది. దీంతో లారీలన్నీ తిరిగి వెనక్కి రాలేని పరిస్థితిలో అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 132 లారీలు వరదలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో లారీ డ్రైవర్లు, యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమాచారమందుకున్న పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులను పడవల్లో ఒడ్డుకు చేర్చుతున్నారు.

    ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..