భార్య ప్రేమకోసం హంతకుడిగా మారిన భర్త..

  0
  164

  తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి కూడా ఆ భర్త సైలెంట్ గా ఉన్నాడు. తాను బలాదూర్ గా తిరుగుతున్నా తన భార్య లవర్ కుటుంబాన్ని పోషిస్తున్నందుకు సంబరపడ్డాడు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇలా కొనసాగుతున్న సమయంలో భార్య రంకుమొగుడు కాస్తా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. భార్యను సైతం అదే ఇంటిలోకి తీసుకొచ్చి కాపురం పెట్టాడు. కానీ గతంలోలాగా తన లవర్ కుటుంబాన్ని మాత్రం పోషించలేకపోయాడు. దీంతో అడ్డుగా ఉన్న కొత్త పెళ్లికూతుర్ని చంపేయాలని భార్య భర్త పథకం పన్నారు. చివరకు ఆమెను చంపేశారు.
  అసలు కథ ఇదీ..
  జార్ఖండ్‌ కుచెందిన రాజేశ్‌ వర్మ హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని వినాయక్‌ నగర్‌ లో ఐదేళ్లుగా నివాసముంటున్నాడు. అతని పక్క గదిలో యూపీకి చెందిన సంజిత్‌, రింకు దంపతులుంటున్నారు. ఆటో డ్రైవర్‌ అయిన సంజిత్‌ జులాయిగా తిరిగి అప్పులపాలయ్యాడు. ఈ సమయంలో అతని భార్య రింకుకు దగ్గరైన రాజేశ్‌ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ ఇంటికి కావాల్సిన అన్ని ఖర్చులు తానే భరించాడు. కొన్నేళ్లుగా సంజిత్‌ కు ఈ విషయం తెలిసినా డబ్బుల కోసం కథ నడిపించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పూజ(21)అనే యువతిని పెళ్లి చేసుకున్న రాజేశ్‌ ఆమెను కూడా అదే ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి రింకుకు దూరంగా ఉండటంతో పాటు ఇంటి ఖర్చులకు డబ్బులివ్వడం ఆపేశాడు. పూజ రావడంతోనే తమకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని, ఇలాగే ఉంటే రాజేశ్‌ పూర్తిగా దూరమవుతాడని భావించిన దంపతులిద్దరూ పూజను హత్యచేసేందుకు పథకం రచించారు. ఈనెల 10న రాజేష్ ఆఫీస్ కి వెళ్లిన సమయంలో నిద్రపోతున్న పూజపై దిండు అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆమె ప్రియుడు, మరో వ్యక్తి వచ్చి గొడవపడ్డారని, ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. నిరాకరించడంతో హత్య చేశారని పోలీసులకు కట్టుకథ చెప్పారు. అనుమానం వచ్చిన జీడిమెట్ల సీఐ బాలరాజు సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ చేపట్టారు. రెండు రోజుల్లో అసలు నిందితులు వీళ్లేనని తేల్చారు. విచారణలో వారు నిజం ఒప్పుకోవడంతో కిరాతక దంపతుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..