కూల్ డ్రింక్ తాగిన నిమిషాల్లో చనిపోయింది..

  0
  170

  చెన్నైలో 13 ఏళ్ల బాలిక కూల్ డ్రింక్ తాగిన వెంటనే వద్దే చనిపోయింది. బీసెంట్ నగర్ లోని ఓ చిల్లర దుకాణం వద్ద ఆ బాలిక కూల్ డ్రింక్ కొన్నది. ఆ అమ్మాయి పేరు ధరణి. ధరణి కూల్ డ్రింక్ తీసుకుంది. షాపు పక్కనే ఉన్న తన ఇంటికి వెల్లి కూల్ డ్రింక్ తాగింది. తాగిన కొద్ది సేపటి తర్వాత ఆ బాలిక రక్తపు వాంతులు చేసుకుంది. ఆ బాలిక అక్క అశ్విని, విధి నిర్వహణలో ఉన్న తల్లిదండ్రులకు ఆ విషయం తెలిపింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే ధరణి చనిపోయింది. ధరణి శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఈ సంఘటన తెలిసి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ షాప్ ని సీజ్ చేశారు. ఈ కూల్ డ్రింక్ ను షోలవరం లోని ఓ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారనే విషయం గుర్తించి అక్కడికి వెళ్లి దాన్ని మూసివేశారు. అక్కడే ఉన్న 540 బాటిల్స్ సీజ్ చేసి ఆ ప్రాంతంలో వివిధ షాపుల్లో ఆ కూల్ డ్రింక్ అమ్మొద్దని ఆదేశాలు జారీ చేశారు. ధరణికి ఉబ్బసం వ్యాధి ఉంది. డాక్టర్లు కూల్ డ్రింక్ తాగొద్దని ఇదివరకే ఆమెకు చెప్పారు. ధరణి శవాన్ని రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఊపిరాడక, ఆమె చనిపోయిందని, కూల్ డ్రింక్ తాగిన తర్వాత అది ఆమె శ్వాస కోశాల్లోకి ప్రవేశించి ఊపిరి కష్టమైపోయిందని డాక్టర్లు నిర్థారించారు. ఆ కూల్ డ్రింక్ నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. కోకా కోలాకి డూప్ లాగా తొగిటో కోలో.. అనే కూల్ డ్రింక్ ని స్థానికంగా తయారు చేస్తున్నారు. ఈ కూల్ డ్రింకే ధరణిపాలిట విషంగా మారింది.

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.