విచారణలో ఏడుపు ఆపని ఆర్యన్ ఖాన్,..

    0
    1313

    స‌ర‌దాగా 20 ఏళ్ళ క్రితం షారుక్ ఖాన్ ఓ ఇంట‌ర్వూలో త‌న కొడుకు అమ్మాయిల‌తో డేటింగ్ చేయాల‌ని, డ్ర‌గ్స్ తీసుకోవాల‌ని, స్మోకింగ్, డ్రింక్ చేయాల‌ని చెప్పాడు. ఇప్పుడు అత‌ని కొడుకు ఆర్య‌న్ ఖాన్ అలాగే త‌యార‌య్యాడు. 18 ఏళ్ళ‌కే బాగా ముదిరి పాకాన ప‌డ్డాడు. ముంబై తీరంలోని క్రూయిజ్‌ షిప్‌లో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చేసిన దాడిలో ఆర్యన్ ప‌ట్టుబ‌ట్టాడు. రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ వినియోగం, విక్రయం వ్యవహారంలో ఆర్యన్‌ఖాన్‌ సహా మొత్తం ఎనిమిది మందిని నిన్న పోలీసులు అరెస్టు చేశారు. దీంతో షారుక్ షాక్ లోకి వెళ్ళిపోయాడు. అరెస్ట్ త‌ర్వాత నిబంధ‌న‌ల ప్ర‌కారం రెండు నిమిషాల పాటు షారుక్ త‌న కొడుకుతో మాట్లాడి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. ఆర్య‌న్ ప‌రిస్థితి కూడా అంతే.

    ఇక బెయిల్ కోసం ద‌ర‌కాస్తు చేసుకున్న ఆర్యన్ ముంబై సిటీ కోర్టులో చుక్కెదురైంది. బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అతడితో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ దమేచాలకు కూడా బెయిల్ తిర‌స్క‌రించింది. డ్ర‌గ్స్ కేసులో ఆర్య‌న్ కు సంబంధం లేద‌ని అత‌ని త‌ర‌పు న్యాయ‌వాది స‌తీష్ మ‌నేషిండే వాద‌న‌లు వినిపించినా, ప‌క్కా ఆధారాల‌తోనే అరెస్టు చేశామ‌ని ఎన్సీబీ వాదించింది. అత‌నితో పాటు అత‌ని మిత్రుల వ‌ద్ద నుంచి మ‌రింత స‌మాచారం రాబ‌ట్టాల్సి వుంద‌ని కోరింది. దీంతో ఈ నెల 7వ తేదీ వరకు నిందితుల‌ను ఎన్సీబీ కస్టడీకి అనుమతించింది.

    ఇక ఆర్య‌న్ విష‌యానికి వ‌స్తే 18 ఏళ్ళ‌కే బాగా ముదిరిపోయాడు. విదేశాల్లో కూడా అత‌ను డ్ర‌గ్స్ వాడేవాడ‌ని స‌మాచారం. దుబాయ్, బ్రిట‌న్ వంటి దేశాల‌కు వెళ్ళిన‌ప్పుడు కూడా డ్ర‌గ్స్ వినియోగించేవాడ‌ని చెబుతున్నారు. ఆర్య‌న్ మొబైల్ లో కీల‌క స‌మాచారం వుంద‌ని భావిస్తున్నారు. అమ్మాయిల ఫోటోలు కూడా మొబైల్ లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం వెన‌క సూత్ర‌ధారులు ఎవ‌రు ? పాత్ర‌ధారులు ఎవ‌ర‌న్న‌ది ? తెలియాల్సివుంది.

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.