మూగ‌జీవాల‌కు విందు- ఇదే పెళ్ళి వేడుక‌.

  0
  50

  నెల్లూరుకి చెందిన ఓ జంట వినూత్నంగా త‌న పెళ్ళి వేడుక‌ను జ‌రుపుకుంది. పెళ్ళికి వ‌చ్చిన అతిధిల‌తో పాటు మూగ‌జీవాల‌కు విందు ఇచ్చారు. గ‌త మే 24న నిఖిల్, రక్ష పెళ్లితో ఒక్కటయ్యారు. వీరు తెలుగువారు కాదు. వ్యాపార నిమిత్తం ఉత్తర భారతదేశం నుంచి వచ్చి నెల్లూరులో స్థిరపడ్డారు. అయితే తమ పెళ్లి వినూత్నంగా ఉండాలని కోరుకున్న నిఖిల్, రక్ష… న‌గ‌రంలోని శ్రీ మ‌హావీర్ జైన్ ప‌శు సేవా కేంద్రంలోని గోశాలలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందులో ఎండుగడ్డి, పచ్చగడ్డితో పాటు రకరకాల పిండివంటలు, ఫలాలను ప‌శుప‌క్ష్యాదులకు అందించి మురిసిపోయారు. ఈ విందు కోసం నిఖిల్, రక్ష రూ.65 వేలు ఖర్చు చేయడం విశేషం. కాస్త ఆల‌స్యంగా వ‌చ్చిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ముఖ్యంగా జంతు, ప‌క్షి ప్రేమికులు ఈ జంట‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..