మేం ఇక భార్యా భర్తలం కాదు..

  0
  682

  బాలీవుడ్ లో మ‌రో సినిమా బంధం తెగిపోయింది. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ గా ఖ్యాతిపొందిన అమీర్ ఖాన్‌, త‌న భార్య కిర‌ణ్ రావుతో విడిపోతున్నారు. ఈ మేర‌కు వారిద్ద‌రూ సంయుక్త ప్ర‌క‌ట‌న చేశారు. వీరి ప్ర‌క‌ట‌న బాలీవుడ్ లో సంచ‌ల‌నం రేపింది. త్వ‌ర‌లో తాము విడాకులు తీసుకుంటున్నామ‌ని, 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాము విడిపోవాల‌ని కొంత కాలం క్రితమే నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామ‌ని తెలిపారు.

  త‌మ‌ వైవాహిక బంధంలోని ఎన్నో తీపి జ్ఞాప‌కాలు, చిరున‌వ్వులు, హాయిగా గ‌డిపిన రోజులు ఎప్ప‌టికీ గుర్తిండిపోతాయ‌ని చెప్పుకొచ్చారు. ఇక‌పై తాము త‌మ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఇక‌పై తాము భార్యాభ‌ర్త‌లం కాద‌ని స్ప‌ష్టం చేశారు. తాము విడిపోయినా త‌మ పిల్ల‌ల‌కు మాత్రం త‌ల్లిదండ్రులుగా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. అమీర్ ఖాన్ 1986లో రీనా ద‌త్త‌ను పెళ్లి చేసుకుని, 2002లో విడాకులు ఇచ్చారు. అనంత‌రం కిర‌ణ్ రావ్‌ను 2005లో పెళ్లి చేసున్నాడు. ఇప్పుడు ఆమెతోనూ విడిపోతున్నాడు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.