టాలీవుడ్ లో తొలి సిక్స్ ప్యాక్ హీరో అల్లు అర్జున్. దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ తో అలరిస్తారు. ఆ తర్వాత టాలీవుడ్ లో దాదాపుగా అందరు హీరోలు ఆ ఫీట్ కోసం బాగా ట్రై చేశారు. ఇప్పటికీ చాలామంది సిక్స్ ప్యాక్ హీరో అనిపించుకోడానికి ఉబలాటపడుతున్నారు.
తాజాగా అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ బాడీ సాధించాడు. సరైన హిట్ కోసం ట్రై చేస్తున్న శిరీష్, ముందు ఫిట్ బాడీ సాధించాడు. లాక్ డౌన్ టైమ్ లో సినిమా షూటింగ్ లకు గ్యాప్ రావడంతో.. జిమ్ కి వెళ్లి సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. ఇలా తన ఫొటోలను ట్విట్టర్ లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
Mirror selfies. Coz photoshoots are too mainstream! 😉 pic.twitter.com/PGymOsAo5b
— Allu Sirish (@AlluSirish) May 21, 2021