కరోనా వచ్చింది అనడానికి లక్షణాలేంటి అనే విషయంపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. జ్వరం, ఒళ్లునొప్పులు.. ప్రాథమిక లక్షణాలుగా తేల్చినా.. ఆ తర్వాత అనేక ఇతర లక్షణాలు కూడా దీనికి జత కలుస్తున్నాయి. వాసన కోల్పోవడం, రుచి కోల్పోవడం వల్ల కూడా కరోనా వచ్చిందని తేల్చి చెబుతున్నారు. అయితే దీనికి ఇప్పుడు మరో కొత్త లక్షణాన్ని కూడా జతచేర్చారు.
కొవిడ్ టంగ్..
కొంత మందిలో నాలుక ఎర్రబారడం, ఎండిపోవడం, దురదగా అనిపించడం, నాలుకపై గాయాలు కావడం వంటివి కూడా కరోనా లక్షణాలుగా తాజాగా గుర్తించారు. ఈ లక్షణాలు ఉంటే కరోనా టెస్టు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలను కొవిడ్ టంగ్ అని చెప్తున్నారు. ఈ లక్షణాలున్న వారిలో నీరసం కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్ టంగ్ లక్షణాలకు గల కారణాలు ఎంటి? కరోనా కారణంగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా మరేమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై లోతైన అధ్యయనాలు జరుగుతున్నాయి.