అన్నయ్యా.. రొంబ థ్యాంక్స్..

    0
    52

    చిరంజీవి మానవత్వానికి చేయెత్తి దండం పెడుతున్నారు తమిళ నటుడు పొన్నాంబళం. కిడ్ని ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఆస్పత్రిలో చేరిన తన కష్టాన్ని తెలుసుకుని 2లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారంటూ చిరంజీవికి ఆయన సోషల్ మీడియా వేదికగా థన్యవాదాలు తెలిపారు. “అన్నయ్యా… మీ సాయం మరువలేను. నా కిడ్నీ మార్పడికి మీరు పంపిన రెండు లక్షలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరచిపోలేను. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఆ ఆంజనేయస్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలి. జై శ్రీరామ్‌” అంటూ తన సందేశాన్ని తమిళంలో వీడియో ద్వారా తెలియచేశారు పొన్నాంబళం.

    చిరంజీవితో ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు వంటి సినిమాల్లో నటించారు పొన్నాంబళం.

    ఆమధ్య పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా చాలామంది స్పందించారు. చిరంజీవి 2 లక్షల రూపాయలు ఆయన చికిత్సకోసం ట్రాన్స్ ఫర్ చేశారు.

    ఇవీ చదవండి..

    ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

    వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

    కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

    రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు