కృష్ణపట్నం మందుపై సీఎం జగన్ సమీక్ష..

  0
  54

  నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీపై ముఖ్యమంత్రి జగన్ వివరాలు తెప్పించుకున్నారు. ఈ మందు పంపిణీపై చర్చించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మందు కరోనాకు పనిచేస్తుందన్న అభిప్రాయంతో వేలాదిమంది ప్రజలు కుగ్రామం అయిన కృష్ణపట్నానికి నిన్నటినుంచే చేరుకుని అక్కడే ఉన్నారు. ఈ రోజు ఉదయాన్నే వేలాదిమంది కృష్ణపట్నం చేరుకున్నారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయుర్వేద మందుని ప్రారంభించారు. కొద్ది సేపటికే జనం ఆ మందు ఉన్న పాత్రలపై పడి లాక్కుపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని మందు పంపిణీని నిలిపివేశారు. అధికారులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ నిబంధనలు, సామాజిక దూరం పాటించకుండా ఇలా చేయడం మంచిది కాదంటూ మందు పంపిణీ ఆపేశారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో సీఎం జగన్ జోక్యం చేసుకున్నారు. ఉన్నతాధికారుల్ని పిలిపించి చర్చిస్తున్నారు. ఆ మందు శాస్త్రీయత, పనిచేసే విధానం తెలుసుకుంటున్నారు. అధికారులు తెప్పించిన నివేదికలపై చర్చించి అనంతరతం నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మందు పంపిణీకి అనుమతిస్తే, ప్రభుత్వం చేయాల్సిన చర్యలపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు