పిల్లలకు ఐఫోన్ ఇస్తున్నారా.అయితే జాగ్రత్త

  0
  655

  పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వడం ప్రమాదకరం. అందులోనూ యాపిల్ ఐ ఫోన్ ఇవ్వడం మరింత ప్రమాదకరం. ఇస్తే ఏమవుతుందిలే అనుకుంటే ఈ స్టోరీ చదవండి, మీరు ఇక ఆ సాహసం చేయరుగాక చేయరు.
  ఫ్రీఫైర్ గేమ్ ఆడుతూ ఇటీవల ఓ పిల్లాడు తల్లి అకౌంట్ ఖాళీ చేశాడు. అమెరికాలో ఏడేళ్ల పిల్లాడు అస్ హాజ్, తండ్రి ఐఫోన్ లో ఐట్యూన్స్ లో గేమ్ ఆడుతూ లక్షా 30వేల రూపాయలు పోగొట్టాడు. తండ్రి ఐఫోన్ తీసుకుని ఐట్యూన్ గేమ్ ఆడుతున్నాడు పిల్లవాడు. డ్రాగన్ రైజ్ ఆఫ్ బెర్క్ అనే గేమ్ కి టాప్ అప్ చేయించాడు.

  Dragons Rise of Berk MOD Apk

  తండ్రి అకౌంట్ లింక్ చేసి ఉండటంతో వెంటనే డబ్బులు కట్ అయిపోయాయి. ఈ విషయం తండ్రికి మెయిల్ ద్వారా వెళ్లింది. అయితే తండ్రి అది చూసుకోలేదు. ఇలా గంట వ్యవధిలో ఆ పిల్లవాడు 29సార్లు టాప్ అప్ చేయించాడు దీంతో లక్షా 30వేల రూపాయలు ఆవిరైపోయాయి. గంట తర్వాత 29వ మెయిల్ చూసుకున్న తండ్రి లబోదిబోమంటూ వచ్చి ఫోన్ లాగేసుకున్నాడు.
  4నెలల క్రితం న్యూయార్ లో ఓ పిల్లాడు ఇలాంటి గేమ్ ఆడుతూ తండ్రి అకౌంట్ ఖాళీ చేశాడు. సో.. తల్లిదండ్రూలూ జాగ్రత్త. మీ పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకండి, అది ఐఫోన్ అయితే మరింత జాగ్రత్తగా ఉండండి.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.