క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యాంకరమ్మ..

  0
  519

  ప్రేమ కథలు ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతాయో ఎవరికీ తెలియవు. అలాంటి ఓ అరుదైన ప్రేమకథే టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా, సంజన గణేషన్ ది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా… ఓ యాంకరమ్మ ఓర చూపులకి క్లీన్ బౌల్డ్ అయిపోతాడని ఎవరూ ఊహించలేదు. వందలమంది క్రికెటర్లను ఇంటర్వ్యూ చేసే యాంకర్ సంజన గణేషన్… సరిగ్గా బుమ్రాకే పడిపోతుందని ఎవరూ అనుకోలేదు. అయితే వీరిద్దరి ప్రేమాయణం చాలాకాలం సీక్రెట్ గానే సాగింది. ఎట్టకేలకు ఇటీవలే వీరు తమ లవ్ స్టోరీని రివీల్ చేశారు. తాజాగా పెళ్లి పీటలెక్కారు.

  క్రికెటర్ బుమ్రా, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్, స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజన గణేషన్ ‌‌వివాహం గోవాలో జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరిగింది. ‘మా జీవితంలోనే అత్యంత ఆనందకరమైన రోజు. మా పెళ్లి వార్తను, ఆనందాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం’ అంటూ బుమ్రా ట్వీట్‌ చేశాడు. దీంతో క్రికెటర్లు, నెటిజన్లు బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి మహూర్తం ఫిక్స్ చేసుకున్న బుమ్రా, ఇంగ్లాండ్‌ సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు.

  ఇవీ చదవండి…

  అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

  భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

  ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

  ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??