నోటి దూల సినీ నటి మీరా మిదున్ అరెస్ట్..

  0
  36

  మోడ‌ల్, కోలీవుడ్ సినీ న‌టి మీరా మిథున్ చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీతో పాటు బ‌య‌ట కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ద‌ళిత ద‌ర్శ‌కులు, నటీన‌టుల వ‌ల్ల త‌న‌కు మంచి అవ‌కాశాలు రావ‌డం లేదంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. వారిని ఇండ‌స్ట్రీ నుంచి త‌రిమి వేయాలంటూ వ్యాఖ్యానించింది. వారి ప‌ద్ద‌తులు బాగుండ‌వ‌ని, అనేక నేరాల‌తో వారికి సంబంధాలుంటాయ‌ని ఆరోపించింది.

  మీరా మిథున్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ద‌ళిత సంఘాలు ఆమెపై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆమెపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ద‌ళిత సంఘాల నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో ఆమె ద‌ళితుల‌పై చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్లు కూడా మండిప‌డుతున్నారు. ఆమెను తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు మీరా మిథున్ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేశారు.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..