మక్కళ దేవర మఠంలో బయటపడ్డ సజీవసమాధి , గుహ ..

  0
  145

  కర్ణాటకలో ఒక మఠానికి చెందిన భూమిలో జరుగుతున్న తవ్వకాలలో అద్భుతం బయటపడింది.. ఎప్పుడో సజీవ సమాధి అయిన , సాధువు కి సంబందించిన వస్తువులు , పూజా సామగ్రి , పాత్రలు బయటపడ్డాయి.. మహాపురుషులు సిద్ది చెందినప్పుడు , సజీవ సమాధి అయినప్పుడు , వాళ్లకు సంబందించిన వస్తువులు కూడా సమాధిలోనే ఉంచుతారు. దొడ్డబళాపూర్ జిల్లా మాగడి తాలూకాలో మఠానికి చెందిన భూమిలో తవ్వకాలు జరుపుతుండగా ఇవి బయటపడ్డాయి. తవ్వకాలలో , ఉన్న పళంగా భూమి లోపలకు కుంగి పోవడంతో , ఒక చిన్న గుహ, సమాధి బయటపడ్డాయి. కన్నూరు గ్రామంలో మక్కళ దేవర మఠంలో మఠానికి చెందిన భూమిలో ఈ సంఘటన జరిగింది. ఇత్తడి, తామ్రం, మట్టి వస్తువులు లభించాయి. తట్టలు, దీపం స్తంభాలు, విభూధి ఉండలు, ఉయ్యాల స్తంబం, గంట తదితర వస్తువులు ఉన్నాయి. . గతంలో మఠానికి చెందిన స్వామీజీ ఒకరు సజీవ సమాధి అయ్యారని, ఆయన వస్తువులు కూడా సమాధిలో ఉండిపోయి ఇప్పుడు వెలుగు చూసాయని మఠం నిర్వాహకులు తెలిపారు. పోలీసులు పురాతత్వ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..