అంగన్వాడీ ఆయాపై ఎసిబి రైడ్..ఆస్తులెంతో తెలుసా..?

    0
    6255

    ఆమె ఎమ్మార్వో కాదు , ఆర్డీఓ కాదు.. పోలీసు శాఖలో డిఎస్పీ కాదు..ఒక సామాన్య అంగన్వాడీ ఆయా.. ఆమె ఇంటిపై ఎసిబి దాడులు .. 10 మంది డిఎస్పీ స్థాయి అధికారులు, సిఐలు , కానిస్టేబుళ్లు.. వామ్మో ఎంతమందో..? ఇది జరిగి ఐదు రోజులైంది.. చివరకు ఆమె సంపాదన మార్కెట్ విలువప్రకారం 12 కోట్లుగా తేల్చారు.

    12 ప్లాట్లు , నాలుగు అంతస్తుల బిల్డింగ్ లు , మూడు అంతస్తుల బిల్డింగ్, 8 ఇళ్లు , బ్యాంకుల్లో ఎఫ్ డి లు .. ఇలా ఇన్ని ఆస్తులను ఆమె అంగన్ వాడీ ఆయాగానే సంపాదించింది. ఎలాగంటే ఉద్యోగంలో చేరినప్పటినుంచి అన్నీ అమ్ముకోవడమే.. ఇతర అంగన్వాడీ సెంటర్లలో కూడా పిల్లలకు పెట్టాల్సిన వాటిని చౌకగాకొని అమ్మేస్తుంది..

    ఇలా పోగేసిన డబ్బుతో కోట్లరూపాయల ఆస్తులు సంపాదించింది.. ఆమెపేరు కవిత.. ఒరిస్సాలోని కోరదకాంత ఆంగవాడి సెంటర్లో ఆమె ఆయా.. దేశంలో ఆయా స్థాయి ఉద్యోగిపై ఇంత పెద్దఎత్తున ఎసిబి రైడ్స్ జరగడం ఇదేప్రధమం.. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.