చేతులకింద చెమటకు వైద్యం-లేడి బాడీబిల్డర్ మృతి.

  0
  382

  శరీరంలో జరిగే ర‌క‌రకాల మార్పులు, రసాయనిక ప్రక్రియల కారణంగా దేహం నుంచి చెడు వాసన చెమట రూపంలో వెలువడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఎదుటివారి ముందు చిన్న చూపుకు లోన‌వుతున్న సంద‌ర్భాలు చూస్తుంటాం. మెక్సికోకు చెందిన విమెన్ బాడీ బిల్డ‌ర్ ఒడాలిస్ సాంటోస్ మెనా అనే 23 ఏళ్ళ యువ‌తికి విప‌రీతంగా చెమ‌ట పోస్తుంది. ఆమె సోష‌ల్ మీడియా ఇన్ఫుయెన్స్ ప‌ర్స‌న్ కూడా. ఆమెకు చంకల్లో ప‌ట్టే చెమ‌ట వ‌ల్ల శ‌రీరం నుంచి దుర్వాస‌న రావ‌డం.. చుట్టుప‌క్క‌ల వారికి కూడా అది చేర‌డంతో చాలా ఇబ్బందికి లోన‌వుతోంది.

  ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించింది. “ఇది మామూలు విష‌య‌మే, అయితే చిన్న శ‌స్త్ర‌చికిత్స‌తో ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. అందుకోసం శ‌రీరంలో ఉన్న చెమ‌ట గ్రంధులు తీసేయాల్సి వుంటుంది” అంటూ డాక్ట‌ర్లు ఆమెకు సూచించారు. అది న‌మ్మిన సాంటోస్ మెనా, మ‌రో ఆలోచ‌న లేకుండా శ‌స్త్ర‌చికిత్స చేయించుకుంది. అయితే అది విక‌టించ‌డంతో ఆమె చ‌నిపోయింది. అయితే “శ‌స్త్ర‌చికిత్సకు ముందు ఆమెకు అన‌స్తీషియా ఇచ్చాం. అందుకే ఆమె చ‌నిపోయింది” అంటూ డాక్ట‌ర్లు చెప్ప‌డం విడ్డూరం.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.