బాప్ రే.. 90 ఏళ్ళ బామ్మ సూపర్ డ్రైవింగ్.

  0
  96

  రేషం బాయ్ త‌న్వ‌ర్‌. ఆమె వ‌య‌సు 90 సంవ‌త్స‌రాలు. అయితేనేం… కారు డ్రైవింగ్ చేయాల‌న్న త‌న కోరిక‌ను లేటు వ‌య‌సులో నెర‌వేర్చుకుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ కి చెందిన రేషం బాయ్ కి కారు డ్రైవింగ్ నేర్చుకుని షికార్లు కొట్టాల‌నే కోరిక బ‌లంగా ఉండేది. అయినా వ‌య‌సులో ఉన్న‌ప్పుడు కుటుంబ బాధ్య‌త‌ల‌తో ఆ కోరిక నెర‌వేర్చుకోలేక‌పోయింది. ఇప్పుడు ఆమె 90 ఏళ్ళు నిండాయి. కానీ ఆ కోరిక మాత్రం ఇంకా బ‌లంగానే ఉంది. త‌న కోరిక నెర‌వేర్చుకోవ‌డానికి ప‌ట్టుబ‌డి కారు డ్రైవింగ్ నేర్చుకుంది. అంతేనా… ప‌నిలో ప‌నిగా ట్రాక్ట‌ర్ న‌డ‌ప‌డం కూడా నేర్చేసుకుంది. ఇప్పుడు ఆమె త‌న ఫ్యామిలీని కారులో తిప్పుతూ… కారులో షికారు చేస్తోంది. త‌న కోరిక నెర‌వేర్చుకున్నందుకు ఆ బామ్మ తెగ సంబ‌ర‌ప‌డితోంది. ఇక చుట్టుప‌క్క‌ల వాళ్ళు కూడా బామ్మ‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తున్నారు. ఈ విష‌యం మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ చౌహాన్ వ‌ర‌కు వెళ్ళింది. ఆ బామ్మ కారు డ్రైవింగ్ గురించి తెలుసుకుని ముచ్చ‌ట‌ప‌డిపోయారు. ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.