SUV సెగ్మెంట్ లోకి టాటా.. క్రెటాకి పోటీగా..

    0
    488

    హ్యుండై క్రెటా కారు ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. SUV సెగ్మెంట్ లో ప్రస్తుతం టాప్ సెల్లింగ్ మోడల్ ఇదే. ఆ తర్వాత కియా సెల్టోస్, సోనెట్, హ్యుండై వెన్యూ, నిస్సాన్ మ్యాగ్నైట్, ఫోర్డ్ ఎకో స్పోర్ట్.. ఇలా చాలా మోడళ్లు ఇదే సెగ్మెంట్ లో పోటీ పడుతున్నాయి. వీటికి కాంపిటీషన్ ఇస్తూ టాటా కూడా రంగంలోకి దిగింది. TATA HBX పేరుతో కొత్త మోడల్ ని మార్కెట్ లోకి తెస్తోంది. దీని ధర రూ.5లక్షల నుంచి 7.5 లక్షల మధ్యలో ఉంటుందని సమాచారం. ఈ కారు నెక్సాన్ ను పోలి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ కారు ప్రీమియం లుక్ లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


    టాటా ఆటో ఎక్స్‌పో 2020 లో TATA HBXను ఆవిష్కరించింది. లాంచ్ చేయబోయే కారు.. ఎక్స్‌పోలో చూపించినట్లు 90 శాతం దాదాపు అదే డిజైన్‌ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. TATA HBX అనేది కేవలం ఒక కాన్సెప్ట్ పేరు మాత్రమేనని, లాంచ్ చేయబోన్న కారును టాటా హార్న్‌ బిల్‌గా పరిచయం చేస్తారని అంటున్నారు.

    హెచ్‌బిఎక్స్ కారు టాటా అల్ట్రాస్‌తో నడిచే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో రానుంది. ఇంజిన్ 6000rpm వద్ద 84bhp శక్తిని అందించగలదు. ఈకారులో 5 స్పీడ్ మాన్యువల్, ఏఎమ్ డీ గేర్ బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఆగస్ట్ లో లాంఛింగం ఉంటుందని తెలుస్తోంది.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.