మామిడి పండు ధ‌ర రూ.10 వేలు, ఎందుకో తెలుసా?

  0
  664

  ఒక్క మామిడి పండు ధ‌ర రూ.10 వేలు…
  ఆ వ్యాపారి ఎందుకు కొన్నాడో తెలుసా ?
  ఈ ఫోటోలో క‌నిపిస్తున్న అమ్మాయి పేరు తుల‌సీ కుమారి. ఈ అమ్మాయి వ‌ద్ద ఓ వ్యాపారి మామిడి పండ్లు కొన్నాడు. అది కూడా ఒక్క మామిడి పండు ప‌ది వేల రూపాయ‌లు ఇచ్చి కొన్నాడు. అలా డ‌జ‌ను పండ్ల‌ను కొనుక్కుని వెళ్ళాడు. అంటే ఒక ల‌క్ష 20 వేలు పెట్టి మొత్తం 12 మామిడి పండ్ల‌ను కొన్నాడు. ఇంత ఖ‌ర్చు పెట్టి డ‌జ‌ను మామిడి పండ్ల‌ను ఎందుకు కొన్నాడ‌నే క‌దా మీ సందేహం. అయితే ఈ వార్త‌లోకి వెళ్ళండి.
  ఝార్ఖండ్ లోని జంషెడ్ పూర్ కు చెందిన తులసి కుమారి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి చదువుతోంది. కరోనా వల్ల పాఠశాలలు మూతపడ్డాయి. అయితే ఆన్ లైన్ క్లాసులు వినేందుకు ఆమెకు స్మార్ట్ ఫోన్ లేదు. ఫోన్ కొనిచ్చే స్థోమ‌త ఆమె తండ్రికి లేదు. దీంతో రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్మి, డబ్బును కూడబెట్టాలని తులసి భావించింది. ఈ విషయం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. తుల‌సి గురించి హమేయ హెటే అనే వ్యాపారవేత్త తెలుసుకున్నారు. వెంటనే కారులో ఆమె వద్దకు చేరుకున్నారు. ఒక్కో మామిడి పండును రూ. 10 వేలకు కొంటానని చెప్పారు. అలా చెప్పి 12 మామిడి పండ్లను కొన్నారు. మొత్తం రూ. 1.2 లక్షలకు కొనుగోలు చేసి, డ‌బ్బును ఆమె తండ్రి బ్యాంకు ఖాతాకు బ‌దిలీ చేశారు. ఇదంతా తుల‌సీ తేరుకునేలోపే నిమిషాల వ్య‌వ‌ధిలో జ‌రిగిపోయింది. దీంతో తులసి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. స్మార్ట్ ఫోన్ కొని, ఆన్ లైన్ తరగతులకు హాజరవుతోంది. మరోవైపు, హెటే చేసిన సాయాన్ని అభినందిస్తూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు నెటిజ‌న్లు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.