పాత బైక్ , కారు ఉంచుకోలేము,అమ్మలేము..

    0
    46

    కేంద్రప్రభుత్వం పాత వాహనాలకు ప్రవేశపెట్టిన కొత్త వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ ఏమిటో తెలుసా..? ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మబోతే అడవి , కొనబోతే కొరివి.. లాగానే ఉంటుంది.. దీని ప్రకారం స్వంత వాహనం కాలం 20 ఏళ్ళు పూర్తిఅయితే , దాన్ని పోల్ల్యూషన్ ఫిట్ నెస్ చేయించాలి.. దానికోసం దేశవ్యాప్తంగా 720 సెంటర్లు ఏర్పాటు చేస్తారు. మీ పాత వెహికిల్ ఫిట్ నెస్ లో ఒకే అయితే , దాన్ని మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించాలి.. దానికి మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ కు ఎంత కట్టాలో తెలుసా ..?
    కొత్త వెహికిల్ రిజిస్ట్రేషన్ కన్నా , ఎనిమిది రేట్లు ఎక్కువకట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. అంటే లక్ష రూపాయల మోటార్ సైకిల్ విలువకు , 20 ఏళ్ళ తరువాత రీ రిజిస్ట్రేషన్ అంటే 72 వేలు కట్టాలన్నమాట.. అంటే మీ బైక్ 20 ఏళ్ళు వాడి , అది ఎంత బాగున్నా దాని అమ్మితే మహా ఐతే 5 వేలకు అమ్ముతారు..అమ్మినా ఎవరూ కొనరు. ఇప్పుడు కొత్త వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ కింద దాన్ని మీరు ఉంచుకోవాలంటే 72 వేలు కట్టాలి.. ఇది అయ్యేపనేనా..? అందువల్ల ఇష్టం ఉన్నా , లేకపోయినా దాన్ని తుక్కుకింద తోసెయ్యాలి.. ఇదీ కొత్త వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ ,., అర్ధం , పరమార్థం.. ఇదే అమలులోకి వస్తే , వచ్చే ఐదేళ్ళలో దేశం , ప్రపంచ దేశాలలో అతిపెద్ద ఆటోమొబైల్ హబ్ గా తయారవుతుంది .. కొత్త వెహికిల్స్ బాగా అమ్ముడుపోతాయి.. వాతావరణ కాలుష్యం తగ్గుతుంది..

    ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..