బ్యాంకుల మోసగాడి అప్పగింతకు బ్రిటన్ ఓకే

    0
    418

    దేశంలో అతిపెద్ద మోసగాడిగా పేరుపొందిన నీరవ్ మోడీ పాపం పండింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ.. బ్యాంకులను 14 వేల కోట్ల రూపాయల మేర మోసం చేశాడు. తన మోసం బయటపడే రెండురోజుల ముందే దేశం వదలిపెట్టి పారిపోయాడు. బ్రిటన్ పౌరసత్వం కలిగిన నీరవ్ మోడీని భారతదేశానికి అప్పగించేందుకు బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

     

     

     

    బ్రిటన్ అంతర్గత భద్రత శాఖ కూడా.. నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు అవసరమైన పత్రాలపై సంతకాలు చేసింది. భారత్ లో తనపై విచారణ సరిగా జరగదని.. నీరవ్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. వెస్ట్ మినిస్టర్ కోర్ట్ అభిప్రాయపడింది. ఆయన భారత దేశంలో తనపై ఉన్న కేసులకు సమాధానం చెప్పుకోవాల్సిందేని స్పష్టం చేసింది. దీంతో గత రెండేళ్లుగా బ్రిటన్ ఆశ్రయం పొందేందుకు నీరవ్ చేస్తున్న ప్రయత్నాలు వృధా అయ్యాయి. ఆయనను భారత్ తీసుకొచ్చి.. ముంబైలోని ఆర్ధర్ రోడ్ జైల్లో ఉంచేందుకు ఒక ప్రత్యేకగాడిని కూడా సిద్ధం చేశారు.

     

     

    ఇవీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.