కలలోకి వచ్చి రేప్ చేస్తున్నాడు..

  0
  5640

  ఓ మహిళ పోలీస్ స్టేషన్ కి వచ్చి, తనను రోజూ ఒకతను రేప్ చేస్తున్నాడని చెప్పింది, తనను కాపాడాలని కోరింది. అంతా విన్న పోలీసులు, అతడు ఏ టైమ్ లో వస్తాడు? ఎందుకు రేప్ చేస్తున్నాడని వివరాలు అడిగారు. అంతే, అవాక్కయ్యారు. అతడు కలలోకి వచ్చి రోజూ రేప్ చేస్తాడని చెప్పింది సదరు బాధితురాలు. దీంతో షాకైన పోలీసులు అసలు వివరాలేంటని అడిగారు. ఈ ఘటన బీహార్ లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది.
  బీహార్‌ లోని గాంధీన‌గ‌ర్‌ లో ఉండే ఓ మ‌హిళ, తన కుమారుడు అనారోగ్యం పాల‌వ్వ‌డంతో ప్ర‌శాంత్ చ‌తుర్వేది అనే మాంత్రికుడి వ‌ద్ద‌కు తీసుకెళ్లింది. కుమారుడి ఆరోగ్యం కోసం మాంత్రికుడు పూజ‌లు చేశాడు. కానీ, ఆరోగ్యం కుదుట‌ప‌డ‌క‌పోగా, జ‌న‌వ‌రిలో మృతిచెందాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తన కొడుకుని బతికించలేకపోయిన మాంత్రికుడిని నిల‌దీసేందుకు వెళ్ల‌గా, మాంత్రికుడు త‌న‌పై అత్యాచారం చేసేందుకు ప్ర‌య‌త్నంచాడ‌ని తెలిపింది ఆ మహిళ. ఆ సమయంలో చనిపోయిన త‌న కుమారుడే త‌న‌ను ర‌క్షించాడ‌ని చెప్పింది. ఆ త‌ర్వాత రోజూ త‌న క‌ల‌లోకి వ‌చ్చి మాంత్రికుడు అత్యాచారం చేస్తున్నాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అయితే, మ‌హిళ ఫిర్యాదు మేర‌కు మాంత్రికుడు చ‌తుర్వేదిని పోలీసులు విచారించారు. ఆమెను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేద‌ని చ‌తుర్వేది పోలీసుల‌కు తెలిపాడు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..