కంట్రోల్ తప్పి పొలాల్లోపడ్డ బుల్లి విమానం..

  0
  254

  ఆకాశం నుంచి కిందపడ్డ ఓ పైలట్ రహిత విమానం కలకలం సృష్టించింది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ పొలాల్లో వేగంగా పోతున్న ఓ చిన్న విమానం కూలిపోయింది. దీంతో ఇదేదో పాకిస్తాన్ బాంబులు పెట్టి పంపించిన చిన్న విమానం అని గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. సాయంత్రం 4 గంటల 15నిముషాల సమయంలో కనోవల్ అనే గ్రామంలో ప్రజలు ఇళ్లు వదిలి పరుగులు తీశారు. తమ వరి పొలాల్లో పడిన ఈ చిన్న విమానం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భద్రతా దళాలు ఆ గ్రామానికి వచ్చి ఇది భారత వైమానిక దళం పైలట్ లేకుండా ప్రయోగించిన బుల్లి విమానం అని తేల్చారు. సరిహద్దుల్లో నిరంతర నిఘాకు ఇలాంటి చిన్న విమానాలు వాడే ప్రయోగ దశలో ఇది కిందపడిపోయింది. ఆకాశంలోనే పది, పదిహేను నిముషాలు అటు ఇటి తిరిగి ఊగిసలాడి వరి పొలాల్లో పడింది. భారత వైమానిక దళమే దీన్ని ప్రయోగించిందని, అది కంట్రోల్ తప్పి ఇలా పొలాల్లో పడిపోయిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇది పొలాల్లో పడటంతోనే పాకిస్తాన్ బాంబులు పెట్టి చిన్న విమానాలు పంపించిందని పుకార్లు వెల్లువెత్తాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అంతకు ముందురోజే ఓ డ్రోన్ కెమెరా కిందపడి దాంట్లో టిఫిన్ బాక్స్ బాంబు కనపడటంతో ఆందోళన పడుతున్న గురుదాస్ పూర్ వాసులు ఈ పైలట్ రహిత విమానంతో మరింత భయపడుతున్నారు.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..