ఇప్పుడే పుట్టాడు. ఇతడు వర్జిన్- బాలకృష్ణ.

  0
  385

  హీరో బాలకృష్ణ మాట్లాడితే ఏదో ఒక సెన్సేషన్ ఉండాల్సిందే. అది రాజకీయమైనా , సినీ రంగమైనా .. ఆయన మాటల్లో ఒక ప్రత్యేకత ఉండితీరుతుంది. అలాంటిదే ఇది.. సెహరి సినిమా టీజర్ రిలీజ్ లో ఆయన హీరో హర్ష ని పరిచయం చేస్తూ ఇప్పుడే పుట్టాడు. ఇతడు వర్జిన్ అన్నాడు. ఆ తరువాత సర్దుకొని సినిమాలో ఇప్పుడే పుట్టాడు. అని చెప్పాడు. వకీల్ సాబ్ సినిమాతో వర్జిన్ అన్న పదం పాపులర్ అయింది. హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జోడీగా నటిస్తున్న చిత్రం ‘సెహరి’. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ రిలీజైంది. బాలకృష్ణ స్పీచ్ తో టీజర్ ను రిలీజ్ చేశారు. “ఇతడు హర్ష్‌.. సినిమా హీరో.. అతడు కూడా వర్జిన్‌.. అదే ఇవాళే పుట్టాడు, ఇతడి పుట్టినరోజు నేడు. ఇతడికి పాపం, పుణ్యం ఏం తెలీదు..” అన్న బాలయ్య స్పీచ్‌తోనే నవ్వులు పూయించేశారు. బాలయ్య మాటలకు హర్ష్‌ సిగ్గుతో చచ్చిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడున్నవాళ్లు కూడా ముసిముసిగా నవ్వుకున్నారు.

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.