వ్యాక్సిన్ వేసుకున్న 18 గంటల్లో …

  0
  4821

  ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ చనిపోవటానికి , కరోనా వ్యాక్సిన్ కు సంబంధం ఉందని తాము భావించడంలేదని చెన్నై సిమ్స్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజు శివస్వామి చెప్పారు. గురువారం రోజు వివేక్ కొవాక్సీన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. అయనను తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు వ్యాక్సిన్ పై అవగాహన కల్పించే బ్రాండ్ అంబాసడర్ హోదాకూడా ఇచ్చింది. గురువారం వ్యాక్సిన్ తీసుకున్న తరువాత శుక్రవారం మధ్యాహ్నానికి ఆయన గుండెపోటుతో ఇంట్లోనే కుప్పకూలిపోయారు. అనంతరం హాస్పిటల్ కు తరలించిన తరువాత , ఆయనను ఎక్మో సపోర్టుపై ఉంచారు. ఈ రోజు వేకువనే ఆయన చనిపోయారు.

  కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 18 గంటల్లో ఆయనకు గుండెపోటు రావడంపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రధాన రక్త నాళంలో రక్తం గడ్డ కట్టిందని తేల్చారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కడుతుందని ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సందర్భాల్లో వార్తలొచ్చాయి. అయితే వీటికి వేరే కారణాలున్నాయని చెప్పినా , అవేమిటో డాక్టర్లు చెప్పలేకున్నారు. ఇప్పుడు , వివేక్ విషయంకూడా అలాగే చర్చనీయాంశమైంది. అందుకే వ్యాక్సిన్ కు , గుండెపోటుకు సంబంధంలేదని సిమ్స్ డాక్టర్లు చెప్పారు. విచిత్రం ఏమిటంటే , వివేక్ కు ఇంతవరకు , ఎలాంటి అనారోగ్యంకూడా లేదు.. ఆయనెప్పుడూ గుండె సంబంధిత వ్యాధితో లేరని కూడా డాక్టర్ రాజు శివస్వామి చెప్పారు.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.