చీకటి గదిలో ఓ అమ్మాయి వింత ప్రేమ గాథ..

  0
  565

  ఇదో వింత ప్రేమ కథ. బహుశా ఏ కథలోనూ, సినిమాలోనూ మీరు చదవని, చూడని, ప్రేమ కథ. కనీసం ఊహల్లో కూడా సాధ్యం కాని ప్రేమ కథ. 11 ఏళ్ల క్రితం ఓ అమ్మాయి ఇంటినుంచి పారిపోయింది. అప్పటికి ఆ అమ్మాయికి 18ఏళ్లు. ఆ అమ్మాయికోసం తల్లిదండ్రులు అన్నిచోట్లా వెదికి చివరకు మిన్నకుండిపోయారు. అయితే మనం నమ్మలేని నిజం ఏంటంటే.. ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఇల్లు ఉన్న వీధిలోనే ఓ గదిలో పదేళ్లుగా ఉండిపోయింది. ఎవరికీ తెలియదు. ఆ గదిలో మనుషులు ఉన్నారనే విషయం కూడా ఎవరూ పసిగట్టలేదు. కేరళలోని పాలక్కడ్ జిల్లా నెమ్మరలో ఈ ఘటన జరిగింది.
  అరుదైన ప్రేమకథ..
  ఆ అమ్మాయి ఆ ఊరిలోని ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. ఇద్దరూ వెళ్లిపోవాలని నిర్ణయించుకుని ఎందుకనో మనసు మార్చుకుని ఆ ఊరిలోనే ఓ గదిలో ఆ అమ్మాయిని ఉంచేశారు. విచిత్రం ఏంటంటే ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా లేదు. గదికి ఉన్న ఓ కిటికీ ద్వారా అ అమ్మాయి రోజూ రాత్రి బయటకు వచ్చి కాలకృత్యాలు తీర్చుకుని వెళ్లిపోయేది. పగలంతా ఇంటికి తాళం వేసి, కిటికీ కూడా మూసేశారు. ఆ యువకుడే ఆ అమ్మాయికి అన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాడు.

  ఇలా పదేళ్లు గడిచింది. అబ్బాయి ఇంటి పక్కనే ఆ అమ్మాయిని ఉంచిన గది ఉంది. ఈ విషయం రెండు కుటుంబాలకు కూడా తెలియదు. 3నెలల కిందట అబ్బాయి కనపడకుండా పోయాడు. ఆ యువకుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులో ఉన్న వీరిద్దరినీ పోలీసులు ఎట్టకేలకు పట్టేశారు. మంగళవారం వారిద్దర్నీ కోర్టులో హాజరుపరచగా తాను అబ్బాయితోనే కలసి ఉంటానని యువతి చెప్పడంతో గత పదేళ్లుగా రహస్యంగా ఉంటున్న ఇద్దరి సంబంధాన్ని కాదనలేమని, అందుకనే ఆ అమ్మాయి ప్రేమికుడితో పోయేందుకు అనుమతిస్తున్నామని కోర్టు చెప్పింది.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..