చిన్నారుల కొవిడ్ చికిత్సకు కేంద్రం గైడ్ లైన్స్..

  0
  311

  చిన్నపిల్లల్లో కొవిడ్ చికిత్సకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (DGHS), తాజాగా చిన్నపిల్లల చికిత్సకోసం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ చికిత్స ప్రోటొకాల్ కేవలం పెద్దవారికి మాత్రమేనని, చిన్నారుల విషయంలో దాన్ని పాటించొద్దని క్లారిటీ ఇచ్చింది.

  డీజీహెచ్ఎస్ గైడ్ లైన్స్..
  – 18 ఏళ్లలోపు వారికి రెమిడెసివిర్‌ వాడొద్దు. చిన్నారులపై దాని ప్రభావం, భద్రతపై పూర్తి సమాచారం అందుబాటులో లేనందున.. చిన్నపిల్లల కరోనా చికిత్సలో రెమిడెసివిర్‌ వాడొద్దు.
  – అత్యవసరమైతేనే సీటీ స్కాన్ తీయించాలి.
  – లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న చిన్నారులకు యాంటీ మైక్రోబయల్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు.
  – వైరస్ సోకినా, లక్షణాలు లేనివారికి అసలు ఎలాంటి చికిత్స అవసరం లేదు, వారికి కేవలం బలవర్థకమైన ఆహారం మాత్రమే ఇవ్వాలి.
  – స్వల్ప లక్షణాలు ఉంటే.. పారాసెట్మాల్ మాత్రలు, దగ్గు తగ్గడానికి సిరప్ మాత్రమే వాడాలి.
  – ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే వెంటనే ఆక్సిజన్ చికిత్స ప్రారంభించాలి.
  – ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటేనే స్వల్ప మోతాదులో స్టెరాయిడ్స్ వాడాలి

  ముఖ్యంగా స్టెరాయిడ్స్, రెమిడిసెవిర్ ఇంజక్షన్లపై ఆంక్షలు విధిస్తూ డీజీహెచ్ఎస్ మార్గదర్శకాలు జారీ చేసింది. చిన్నపిల్లల కొవిడ్ చికిత్సలో వాటిని మినహాయించాలని సూచించింది.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..