ఏలూరు జిల్లా గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడి చేశారు. ఎమ్మెల్యేని కొట్టుకుంటూ, తోసుకుంటూ రభస సృష్టించారు. ఎమ్మెల్యేను కాపాడేందుకు వచ్చిన అనుచరులపై కూడా దాడి చేశారు.
ద్వారకాతిరుమల మండలం జీ.కొత్తపల్లిలో ఆ గ్రామ వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ హత్య నేపధ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వెళ్ళారు. గ్రామంలో రెండు వైసీపీ వర్గాలున్నాయి. ఒకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలు సడన్‌గా ఎమ్మెల్యేపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు.
ఒకదశలో పోలీసులకు కూడా ఎమ్మెల్యేను కాపాడడం కష్టమైంది. ఆ వర్గం వారు పోలీసులపై కూడా దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్తితి ఉద్రిక్తంగా మారడంతో అతికష్టం మీద పోలీసులు ఎమ్మెల్యేని ఊరి నుంచి బయటకు తరలించారు.