90 వేల ఫ్రెషర్స్ కోసం క్యాంపస్ సెలెక్షన్లు.

    0
    183

    సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో మరో భూమ్ స్టార్ట్ కానుంది . దిగ్గజ ఐటీ సంస్థలు టిసిఎస్ మరియు ఇన్ఫోసిస్ లు ఈ ఏడాది 90 వేల ఉద్యోగాలను కల్పించేందుకు సన్నాహాలు ముమ్మరం చేశాయి. నైపుణ్యం గల సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కోసం టిసిఎస్ మరియు ఇన్ఫోసిస్ పోటాపోటీగా క్యాంపస్ సెలక్షన్ ల కోసం సిద్ధమయ్యాయి . టిసిఎస్ 40 వేల మంది ఫ్రెషర్స్ ని తీసుకోవాలని టార్గెట్ పెట్టుకుంటే , ఇన్ఫోసిస్ 50వేల మందిని రిక్రూట్ చేసుకోవాలని భావిస్తోంది. గత మూడు నెలల్లో టిసిఎస్ మరియు ఇన్ఫోసిస్ కంపెనీల నుంచి ఐదు శాతం ఉద్యోగులు ఇతర సంస్థలకు లేదా విదేశాల్లో అవకాశాలను వెతుక్కోవడం జరిగింది .

     

    ఇన్ఫోసిస్ మరియు యు.టి సి ఎస్ లు గత ఏడాది 61 వేల మంది ఫ్రెషర్స్ ను క్యాంపస్ సెలక్షన్స్ లో రిక్రూట్ చేసుకున్నారు . ఈ ఏడాది మాత్రం రెండు సంస్థలు కలిపి 90 వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ ను రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయాలు తీసుకుని ఇందుకోసం క్యాంపస్ సెలక్షన్ లు ప్లాన్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని టిసిఎస్ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. 2025 సంవత్సరాల నాటికి 25 శాతం మంది ఎంప్లాయిస్ మాత్రమే ఆఫీసు నుంచి పని చేస్తారని 75% వర్క్ ఫ్రం హోం విధానంలోనే కొనసాగుతారని టిసిఎస్ ప్రకటించింది .

     

    హెచ్ సి ఎల్ కూడా హైబ్రిడ్ వర్కింగ్ టైం కి నిర్ణయం తీసుకుంది . ఉద్యోగుల కుటుంబాల భద్రత తమకు ముఖ్యమని ఒకవైపు బిజినెస్ దెబ్బతినకుండా మరోవైపు తమ ఉద్యోగుల భద్రత కు ఇబ్బంది లేకుండా హైబ్రిడ్ మోడల్ వర్కింగ్ ప్యాట్రన్ ను అమలు చేస్తున్నామని హెచ్ సి ఎల్ చెప్పింది . ఇన్ఫోసిస్ మాత్రం దశలవారీగా వర్క్ వర్క్ ఫ్రొం హోమ్ విధానాన్ని ఆఫీస్ కు మార్పు చేసే ఆలోచన చేస్తున్నట్టు చెప్పింది. 50 :50 హైబ్రిడ్ టైప్స్ ఆఫ్ వర్కింగ్ సిస్టం ను అమలు చేస్తే చేయబోతున్నట్టు ప్రకటించింది.

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.